
RG Kar ex-principal: సందీప్ ఘోష్‌కి భారీ షాకిచ్చిన కోర్టు.. నేరం రుజువైతే మరణశిక్ష..?
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ స్పెషల్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. అతనికి బెయిల్ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అదే విధంగా నేరం రుజువైతే మరణశిక్ష తప్పదని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ డే తెలిపారు. సందీప్ ఘోష్, తలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అభిజిత్ మెండల్ ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు.
వీరికి బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఘోష్‌ను కావాలనే ఈ కేసులో ఇరికించినట్లు అతని తరఫు లాయర్ వాదించారు. కానీ, కోర్టు ఈ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది.
Details
సందీప్ ఘోష్‌పై తీవ్రమైన నేరారోపణలు
సందీప్ ఘోష్‌పై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి, ఆయనను బెయిల్‌పై విడుదల చేయడం సాధ్యంకాదని కోర్టు స్పష్టం చేసింది.
అయితే అభిజిత్ మెండల్‌కు సంబంధించిన బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.
గత ఆగష్టు 9న ఆర్జీ కర్ ఆస్పత్రి సెమినార్ హాల్‌లో ఒక ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది.
ఈ ఘటనకు సంబంధించి, నిందితులు ఆధారాలను తారుమారుచేయడానికి ప్రయత్నించినట్లు సందీప్ ఘోష్‌పై ఆరోపణలు ఉన్నాయి.
అదేవిధంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యమైనందుకు అభిజిత్ మెండల్‌పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.