తదుపరి వార్తా కథనం
    
     
                                                                                Revanth Reddy: ఓటుకు నోటు కేసులో కోర్టు సీరియస్.. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా హాజరు కావాల్సిందే!
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Sep 24, 2024 
                    
                     04:05 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించి నేడు విచారణ జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా నిందితులు ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ విచారణకు హాజరు కాలేదు. దీనిపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిందితులు తమకు విచారణ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టును అభ్యర్థించగా, వారి విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 16కి వాయిదా వేసింది. దీంతో రేవంత్ రెడ్డి సహా మిగతా నిందితులు ఆ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది.