Page Loader
దిల్లీలో 25 ఏళ్ల యువకుడు దారుణ హత్య 
దిల్లీలో 25 ఏళ్ల యువకుడు దారుణ హత్య

దిల్లీలో 25 ఏళ్ల యువకుడు దారుణ హత్య 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 05, 2023
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 25 ఏళ్ల వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కత్తితో పొడిచి,స్లాబ్‌తో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తెల్లవారుజామున 2 గంటలకు రాంలీలా మైదానం సమీపంలో జరిగింది. మోటార్ సైకిల్‌పై వస్తున్న దీపక్‌ను దుండగులు అడ్డగించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ తెలిపారు. బాధితుడు దీపక్ కరవాల్ నగర్‌లోని శివ విహార్ నివాసి అని డిసిపి తెలిపారు.

Details 

పలుమార్లు కత్తితో పొడిచి,స్లాబ్‌తో తలపై బాదారు: డిసిపి

ఈ ఘటనకు సంబంధించిన 29 సెకన్ల సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ముగ్గురు నిందితుల్లో ఒకరు దీపక్‌పై దాడి చేశారు. ఆ తర్వాత అతడితో పాటు మరో వ్యక్తి బాధితుడి ఛాతీపై తన్నడంతో మూడో వ్యక్తి చేతిలో స్లాబ్‌తో దాడికి దిగాడు. సీసీటీవీ ఫుటేజీలో ఈ ముగ్గురూ దీపక్‌ను పలుమార్లు కత్తితో పొడిచి, స్లాబ్‌తో తలను చితకబాదినట్లు తేలిందని అధికారి తెలిపారు. బాధితుడిని జిటిబి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారని డిసిపి తెలిపారు. హత్య కేసు నమోదు చేసి, దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని,విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యువకుడు హత్య వివరాలు తెలుపుతున్న డిసిపి