
UP: డబ్బులివ్వలేదని రక్షించలేదు.. నదిలో కొట్టుకుపోయిన ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరక్టర్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిల్‌హౌర్లో ఘోర విషాదఘటన చోటు చేసుకుంది. డబ్బులివ్వలేదని కారణంలో ఓ వ్యక్తి నదిలో కొట్టుకుపోతున్నా గత ఈతగాళ్లు రక్షించలేదు.
యూపీ ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్ధన్ సింగ్ శనివారం నానమౌ వద్ద గంగానది ఘాట్‌లో సూర్యుడు ఆరాధన కోసం పుణ్యస్నానానికి దిగాడు. అ
తనికి ఈత వచ్చినా ప్రవాహం దాటికి తట్టుకోలేక నదిలో కొట్టుకుపోయాడు.
ఆదిత్య స్నేహితులు ఈ ఘటనను చూసి వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేట్ గజ ఈతగాళ్లను సాయం కోరారు.
అయితే, వారు రూ.10,000 చెల్లిస్తే గానీ ఆదిత్యను రక్షించమని చెప్పారు. తమ వద్ద డబ్బులు లేకపోతే యూపీఐ ద్వారా చెల్లించాలని వారు మొండికేసారు.
Details
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం : డీసీపీ సింగ్
ఈ మొత్తం చెల్లింపులు పూర్తయ్యేసరికి, ఆదిత్య ప్రవాహంలో గల్లంతైపోయాడు.
ఆదివారం కూడా గాలింపు చర్యలు కొనసాగించినప్పటికీ, ఇప్పటివరకు ఆదిత్య ఆచూకీ కనుగొనలేకపోయామని బిల్‌హౌర్ ఏసీపీ అజయ్ కుమార్ చెప్పారు.
గజ ఈతగాళ్లు డబ్బు డిమాండ్ ఆరోపణలపై డీసీపీ సింగ్ స్పందించారు.
ఈతగాళ్ల వాదన భిన్నంగా ఉందని, వారు కేవలం స్టీమర్ ఇంధనం కోసం డబ్బులు అడిగారని తెలిపారు.
ఈ సంఘటనపై విచారణ జరుగుతుందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.