Melting of icebergs: భూతాపం ప్రభావం.. మంచుకొండల కరుగుదలతో ముంచుకొస్తున్న పెను ముప్పు
ఈ వార్తాకథనం ఏంటి
వాతావరణ మార్పుల ప్రభావంతో భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో హిమాలయ ప్రాంతంలోని హిమానదాల కరుగుదలకి దారితీస్తోంది.
నీరు హిమానదాల పరిధిని పెంచుతూ, జలాశయాల విస్తీర్ణం గణనీయంగా పెంచుతోంది.
అయితే ఈ జలాశయాలు కట్టలు తెంచుకునే ప్రమాదం పొంచి ఉండటంతో దిగువన నివసించే ప్రజలు, జీవజాతులు, రోడ్లు, ఆనకట్టలు వంటి మౌలిక వసతులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం పెరుగుతోంది.
తాజా అధ్యయనాల ప్రకారం లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని 67 హిమానద జలాశయాల ఉపరితల వైశాల్యం గత 13 ఏళ్లలో 40 శాతం పెరిగింది.
ఈ విషయాన్ని గమనించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికార సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
Details
వాతావరణ మార్పులపై తక్షణమే స్పందించాలి
మార్చి 10కి వారం ముందు తమ సమాధానాలను సమర్పించాలని ఆదేశించింది. హిమానదాల విస్తీర్ణం 2011-2024 మధ్యకాలంలో 33.7 శాతం పెరిగినట్టు సమాచారం.
ఈ పరిణామం భారత జీవ వైవిధ్య చట్టం, జల కాలుష్య నివారణ చట్టాలకు విరుద్ధంగా ఉండటమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర ప్రభావం చూపే ప్రమాదాన్ని సూచిస్తోంది.
భూతాపం వల్ల హిమనదాల ఉపరితల వైశాల్యం 10.81 శాతం పెరగడాన్ని గడచిన 13 ఏళ్లలో గుర్తించారు. హిమానదాల కరుగుదలపై నిరంతర పరిశోధనలు చేపట్టి నివారణ చర్యలను చేపట్టాలి.
హిమానద జలాశయాల పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాసం కల్పించాలి. జీవ వైవిధ్య రక్షణ, కాలుష్య నియంత్రణ చట్టాలను కచ్చితంగా పాటించాలి.
వాతావరణ మార్పులకు తక్షణం స్పందించకపోతే మానవజాతి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.