Page Loader
Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్లో చరిత్రలోనే తొలి వివాహం.. వధువు, వరుడు ఎవరంటే?
రాష్ట్రపతి భవన్లో చరిత్రలోనే తొలి వివాహం.. వధువు, వరుడు ఎవరంటే?

Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్లో చరిత్రలోనే తొలి వివాహం.. వధువు, వరుడు ఎవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2025
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాష్ట్రపతి అధికారిక నివాసమైన రాష్ట్రపతి భవన్‌లో తొలిసారి ఒక వివాహ వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్ లోపల ఈ పెళ్లి వేడుక జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అనుమతితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పూనమ్ గుప్తా ఎవరంటే? మధ్యప్రదేశ్‌లోని శివపురి ప్రాంతానికి చెందిన పూనమ్ గుప్తా, ప్రస్తుతం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్(PSO)గా సేవలందిస్తున్నారు. 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మహిళా బెటాలియన్‌కు నాయకత్వం వహించిన గౌరవాన్ని కూడా ఆమె దక్కించుకున్నారు.

Details

మదర్ తెరిసా క్రౌన్ కాంప్లెక్స్ లో వివాహం

పూనమ్ గుప్తా, గణిత శాస్త్రంలో డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంగ్లిష్ లిటరేచర్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. 2018 UPSC CAPF పరీక్షలో 81వ ర్యాంకు సాధించారు. ఇందుకు ముందు, బీహార్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఆమె సేవలందించారు. పూనమ్ గుప్తా కేవలం ఉద్యోగంలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా యూత్‌ను ప్రేరేపించే వ్యక్తిగా నిలిచారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో విద్యార్థులకు ప్రేరణ కలిగించే సందేశాలు, తన పనికి సంబంధించిన విశేషాలు పంచుకుంటూ ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పూనమ్ గుప్తా కృషి, నిబద్ధతను గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆమె పెళ్లి వేడుకను మదర్ తెరిసా క్రౌన్ కాంప్లెక్స్‌లో నిర్వహించేందుకు ప్రత్యేకంగా అనుమతించారు.

Details

సీఆర్‌పీఎఫ్ అధికారిని పెళ్లి చేసుకోనున్న పూనమ్ గుప్త

పూనమ్ గుప్తా, సీఆర్‌పీఎఫ్ అధికారి అవ్నీష్ కుమార్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ వేడుక రాష్ట్రపతి భవన్ భద్రతా నిబంధనల ప్రకారం ఖచ్చితమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరగనుంది. ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. అయితే ఈ పెళ్లి గురించి రాష్ట్రపతి భవన్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.