తదుపరి వార్తా కథనం
Amaravati: అయిదేళ్ల నిరీక్షణకు తెరపడింది.. అమరావతి టవర్ల పునాదుల పునః ప్రారంభం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 01, 2025
10:45 am
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతి రాజధాని నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా అడ్డుకోవడంతో గడిచిన ఐదేళ్లలో భవనాల పునాదుల చుట్టూ నీరు చేరిపోయింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి సారించి, జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు భవనాల చుట్టూ చేరిన వర్షపు నీటిని తొలగిస్తోంది.
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఐకానిక్ టవర్ల పునాదులు ఇప్పటివరకు నీటిలోనే మునిగి ఉండగా, ప్రస్తుతం నీరు పూర్తిగా తొలగించడంతో ట్రాక్లర్లు నిర్మాణాల ఫౌండేషన్‌పైకి చేరుకుంటున్నాయి.