LOADING...
Andhra Pradesh: ఏపీలో పరిశ్రమల వెల్లువ.. పెట్టుబడిదారులు ఎందుకు క్యూ కడుతున్నారంటే?
ఏపీలో పరిశ్రమల వెల్లువ.. పెట్టుబడిదారులు ఎందుకు క్యూ కడుతున్నారంటే?

Andhra Pradesh: ఏపీలో పరిశ్రమల వెల్లువ.. పెట్టుబడిదారులు ఎందుకు క్యూ కడుతున్నారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2025
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్న ముఖ్య లక్ష్యంతో సీఎం చంద్రబాబు పాలన ముందుకు సాగుతోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు ముమ్మరం చేస్తూ, పరిశ్రమలను ఒకేచోట కేంద్రీకృతం చేయకుండా అన్ని జిల్లాల్లో విస్తరించేలా ప్రోత్సాహాలు, రాయితీలు, భూమి-నీటి కేటాయింపులు అందిస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో పరిశ్రమల రాకతో ఆర్థిక పురోగతి సాధ్యమని ప్రభుత్వం భావిస్తూ ఎంఎస్‌ఎంఈల స్థాపనకు ఔత్సాహికులను ప్రోత్సహిస్తోంది.

Details

రూ. 4 వేల కోట్లకు పైగా పెట్టుబడులు 

ఏడాదిన్నర కాలంలోనే అనంతపురం జిల్లాకు రూ.4,194 కోట్ల పెట్టుబడులొచ్చాయని ప్రభుత్వం తెలిపింది. దీని ద్వారా ప్రత్యక్ష-పరోక్షంగా 3వేల మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపింది. ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో అనంతపురానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ప్రకటించగా, కొన్ని యూనిట్లకు సీఎం చంద్రబాబే శంకుస్థాపన చేశారు. అనంతపురం-శ్రీసత్యసాయి జిల్లాల్లో రేమండ్ గ్రూప్ మూడు వేర్వేరు యూనిట్లను నెలకొల్పుతోంది. మొత్తం రూ. 1,200కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రాప్తాడు వద్ద అప్పారెల్ పార్క్ కోసం రూ. 497కోట్లు శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఆటో కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం రూ. 441కోట్లు టేకులోడు వద్ద ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్‌కు రూ. 262కోట్లు ఈ మూడు యూనిట్ల ద్వారా 6,500ఉద్యోగాలు ఏర్పడనున్నట్లు వెల్లడించింది.

Details

 ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ఫ్యాక్టరీ

కళ్యాణదుర్గంలోని తిమ్మసముద్రం వద్ద స్కై ఫ్యాక్టరీ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రూ. 1,300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభించే ఈ యూనిట్‌లో 1,000 ఎయిర్ ట్యాక్సీల తయారీ లక్ష్యం దీని ద్వారా 180 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. దీని సమీపంలోనే గిన్‌ఫ్రా ప్రెసిషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బై-మాడ్యూలర్ ఛార్జ్ సిస్టమ్స్ తయారీ యూనిట్‌కు రూ. 1,150 కోట్ల పెట్టుబడితో ముందుకు వస్తోంది. 121 ఎకరాల్లో యూనిట్ స్థాపనకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.

Details

సుగ్నా స్పాంజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ విస్తరణ 

తాడిపత్రి మండలం బోగసముద్రం వద్ద ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుగ్నా స్పాంజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొత్త యూనిట్ కోసం రూ. 1,247 కోట్లు పెట్టుబడులకు ఆమోదం పొందింది. ఈ యూనిట్‌లో 1,100 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మొత్తం మీద, అనంతపురం జిల్లాలో భారీ స్థాయిలో పరిశ్రమలు ప్రవేశిస్తుండటం వల్ల రాయలసీమలో పారిశ్రామిక వాతావరణం కొత్త ఊపును సంతరించుకుంటోంది.