Manmohan singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి నిగమ్‌బోధ్ ఘాట్ వరకు సాగనుంది., అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఉదయం 11.45 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పార్థివదేహాన్ని శనివారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు.
మన్మోహన్ సింగ్ మృతికి జో బైడెన్ సంతాపం
పార్థివదేహం వద్ద ఆయన సతీమణి గురుశరణ్ సింగ్, కుమార్తె, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అంజలి ఘటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి కూడా నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన, భార్య జిల్ బైడెన్, మన్మోహన్ సింగ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.