
Telangana Assembly Elections 2023: ఓటేశాక వేలికి వేసే సిరా, తయారీ మన హైదరాబాద్‌లోనే!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఎన్నికల (Telangana elections) సమరం మొదలైంది. నవంబర్ 30న పోలింగ్ ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో ఓటు హక్కును వినియోగించడానికి ప్రజలు సిద్ధమయ్యారు. డిసెంబర్ 3న తెలంగాణలో ఏ జెండా ఎగురుతుందో తేలిపోతుంది.
ఈ ఫలితాల కోసం తెలంగాణ ప్రజలు అతృతుగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత చూపుడు వేలికి ఉపయోగించే సిరా హైదరాబాద్ (Hyderabad) లోనే తయారు కావడం విశేషం.
ప్రపంచంలోని వంద దేశాలు ఈ సిరాను ఉపయోగించడం గమనార్హం.
ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత చూపుడు వేలికి ఈ సిరాను ఉపయోగిస్తారు.
ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా గుర్తుగా ఇండెలబుల్ ఇంక్‌ను ఉపయోగిస్తారు.
Details
ఒక లీటర్ సిరా ఇంక్ ధర రూ.12వేలు
ఇండెలబుల్ ఇంక్‌లో సూమారు 15 నుండి 18 శాతం సిల్వర్ నైట్రేట్‌తో పాటు కొన్ని రసాయనాలను వీటి కోసం ఉపయోగిస్తారు.
ఈ సిరాను కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ వార్షిస్ లిమిటెడ్ సంస్థ, హైదారాబాద్ లోని రాయుడు లాబోరేటరీస్ సంస్థలు తయారు చేస్తున్నాయి.
ఇక ప్రపంచంలోని వందకి పైగా దేశాలు హైదరాబాద్ రాయుడు లాబోరేటరీస్ తయారు చేసే ఇండెలబుల్ ఇంక్‌ను ఉపయోగిస్తున్నాయి.
మరోవైపు మైసూర్ పెయింట్స్ అండ్ వార్షిప్ లిమిటెడ్ సంస్థ తయారు చేసే సిరాను మాత్రమే భారత ఎన్నికల సంఘం ఉపయోగిస్తోంది.
ఒక లీటర్ ఇంక్ ధర రూ. 12 వేలు ఉంటుంది
1962లో అప్పటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ ఈ సిరాను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు.