Maharashtra: మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
మహారాష్ట్రలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తుది ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న ముంబై అజాద్ మైదానంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. భారతీయ జనతా పార్టీ వెల్లడించిన వివరాల ప్రకారం, ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా అదే వేదికపై ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని తెలిసింది. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహాయుతి కూటమి తన ప్రభుత్వ ఏర్పాటుకు ఇదే రోజున అధికారికంగా శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ, మహాయుతి ప్రభుత్వం ప్రమాణ స్వీకార వేడుకను అజాద్ మైదానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుక మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టంగా నిలవనుంది.