Page Loader
అమెరికా: న్యూజెర్సీ రెస్టారెంట్‌లో 'మోదీ జీ థాలీ'; ఆ వంటకం ప్రత్యేకలు ఇవే 
అమెరికా: న్యూజెర్సీ రెస్టారెంట్‌లో 'మోదీ జీ థాలీ'; ఆ వంటకం ప్రత్యేకలు ఇవే

అమెరికా: న్యూజెర్సీ రెస్టారెంట్‌లో 'మోదీ జీ థాలీ'; ఆ వంటకం ప్రత్యేకలు ఇవే 

వ్రాసిన వారు Stalin
Jun 12, 2023
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూన్ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ప్రధాని మోదీ అమెరికా రాకను పురస్కరించుకొని ఆయనకు అంకితం చేస్తూ న్యూజెర్సీకి చెందిన ఓ రెస్టారెంట్‌లో ప్రత్యేక థాలీని రూపొందించారు. 'మోదీ జీ థాలీ' పేరుతో ఆవిష్కరించిన ఈ ప్రత్యేక వంటకం కోసం న్యూజెర్సీలోని ప్రవాస భారతీయులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ చెఫ్ శ్రీపాద్ కులకర్ణి 'మోదీ జీ థాలీ'ని తయారు చేశారు. ఖిచ్డీ, రసగుల్లా, సర్సన్ కా సాగ్, కాశ్మీరీ దమ్ ఆలూ, ఇడ్లీ, ధోక్లా, చాంచ్, పాపడ్ వంటి భారతీయ సంప్రదాయ వంటకాల మేళవింపుతో ఈ వంటకాన్ని కులకర్ణి తయారు చేశారు. భారతీయ ప్రవాసుల డిమాండ్‌ల మేరకు చెఫ్ కులకర్ణి ఈ ప్రత్యేక థాలీని తీర్చిదిద్దారు.

మోదీ

'మోదీ జీ థాలీ'లో మిల్లెట్స్ వెరైటీ

మోదీ జీ థాలీలో మిల్లెట్‌లను కూడా ఉపయోగించారు. భారత ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్న మిల్లెట్స్‌ను ఈ థాలీలో చేర్చడం ద్వారా భారతీయతను కూడా చాటుతున్నారు. 'మోదీ జీ థాలీ' విజయవంతమైతే విదేశాంగ మంత్రి జైశంకర్‌కు అంకితం చేసిన మరో ప్రత్యేక థాలీని త్వరలో ప్రారంభించాలని రెస్టారెంట్ యజమాని యోచిస్తున్నారు. ప్రధాని మోదీ పేరు మీద థాలీ తయారు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సెప్టెంబర్ 17న ఆయన పుట్టినరోజు సందర్భంగా దిల్లీకి చెందిన ఓ రెస్టారెంట్ 56 అంగుళాల మోదీ జీ థాలీని తయారు చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూన్ 21న అమెరికాకు బయలుదేరనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీ జీ థాలీ ఇదే