Unemployment rate: దేశంలో 13.4శాతానికి తగ్గిన గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం రేటు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో 15 ఏళ్లు లేదా.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం రేటు 2022-23లో 13.4%కి తగ్గింది.
ఇది అంతకుముందు సంవత్సరంలో 14.9 శాతంగా ఉంది. కేంద్ర స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ఈ గణాంకాలను వెల్లడించింది.
ఈ జాబితాలో అత్యల్ప నిరుద్యోగ రేటుతో చండీగఢ్ మొదటి స్థానంలో నిలిచింది.
15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల గ్రాడ్యుయేట్లలో అత్యల్ప నిరుద్యోగ రేటులో 5.6 శాతంతో చండీగఢ్ మొదటి స్థానంలో ఉండగా.. దిల్లీ 5.7 శాతంతో రెండవ స్థానంలో నిలిచింది.
దేశంలో సాధారణ పరిస్థితుల్లో గత 6 సంవత్సరాలలో ఇది అతి తక్కువ నిరుద్యోగిత రేటు కావడం గమనార్హం.
నిరుద్యోగం
అత్యధిక అత్యధిక నిరుద్యోగిత రేటులో 3వ స్థానంలో నిలిచన
2022-23లో అత్యధిక నిరుద్యోగిత రేటు (33 శాతం) అండమాన్, నికోబార్ దీవుల్లో ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
26.5 శాతంతో లద్ధాఖ్, 24 శాతంతో ఆంధ్రప్రదేశ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
రాజస్థాన్‌లో 23.1 శాతం, ఒడిశాలో 21.9 శాతం నిరుద్యోగిత రేటు ఉంది.
దేశంలో కార్మిక శక్తి ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, భారత ప్రభుత్వం ఏప్రిల్ 2017 నుంచి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) ద్వారా ఈ డేటాను సేకరించడం ప్రారంభించింది.
కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదికతో 6వది.
ఇంతకుముందు, జూలై 2017-జూన్ 2018, జూలై 2018-జూన్ 2019, జూలై 2019-జూన్ 2020, జూలై 2020-జూన్ 2021, జూలై 2021-జూన్ మధ్యకాలంలో 5 వార్షిక నివేదికలను కేంద్రం విడుదల చేసింది.