Page Loader
గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టీఎస్‌పిఎస్‌సీ అప్పీల్
గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టీఎస్‌పీఎస్‌సీ అప్పీల్

గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టీఎస్‌పిఎస్‌సీ అప్పీల్

వ్రాసిన వారు Stalin
Sep 25, 2023
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూన్ 11న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సోమవారం టీఎస్‌పీఎస్‌సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. అత్యవసర విచారణకు టీఎస్‌పిఎస్‌సీ అనుమతి కోరింది. టీఎస్‌పీఎస్‌సీ దాఖలు చేసిన అప్పీలుపై డివిజన్ బెంచ్‌ మంగళవారం విచారణ చేపట్టనుంది. మార్గదర్శకాలను టీఎస్‌పీఎస్‌సీ ఉల్లంఘించిన నేపథ్యంలో సింగిల్ బెంచ్ పరీక్షలను రద్దు చేసింది. ఈ పరీక్షలు రద్దు కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ప్రిలిమ్స్ పరీక్ష రద్దుతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు రాశామని, మరోసారి రాయమంటే తమ వల్ల కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేపు విచారించే అవకాశం