Page Loader
TG Panchayat Elections: తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లకు షెడ్యూల్ ఖరారు 
తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లకు షెడ్యూల్ ఖరారు

TG Panchayat Elections: తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లకు షెడ్యూల్ ఖరారు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 22, 2024
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. ఈ జాబితాపై సెప్టెంబర్ 7 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. ఇక సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది జాబితాను ప్రచురించనున్నారు. అదే విధంగా ఓటరు జాబితా తయారీపై ఈనెల 29న కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.