Telangana: మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు; విద్యార్థులకు బిర్యానీ, కిచిడి
విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మరింత పౌష్టికరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మిడ్-డే మీల్ మెనూలో మార్పులు చేసింది. కేంద్ర జాయింట్ రివ్యూ మిషన్ బృందం ఇచ్చిన నివేదకను బట్టి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) విద్యార్థులకు అందించే కొత్త మెనూ రూపొందించింది. ఎన్ఐఎన్ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం మెనూలో మార్పులు చేసింది. 2023-24 విద్యా సంవత్సరం తొలి రోజు నుంచే కొత్త మెనూను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లు చేస్తోంది.
కొత్త మెనూ ప్రకారం అందించే ఆహార రకాలు ఇవే
సోమవారం: కిచిడీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, గుడ్డు మంగళవారం: అన్నం, సాంబార్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ బుధవారం: అన్నం, ఆకుకూరల పప్పు, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, గుడ్డు గురువారం: వెజిటబుల్ బిర్యానీ, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ శుక్రవారం: అన్నం, సాంబార్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, గుడ్డు శనివారం: అన్నం, ఆకుకూరల పప్పు, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ జూన్ 12 నుంచి సవరించిన మెనూను కచ్చితంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అన్ని మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. ఆహార భద్రత, పరిశుభ్రత పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది. 28,606 పాఠశాలల్లో 1నుంచి పదో తరగతి వరకు మొత్తం 25,26,907 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం కింద ఉన్నారు.