Page Loader
Delhi : ఆ ఉగ్రవాదులంతా ఉన్నత విద్యావంతులే.. బైక్ దొంగల వెనుక భారీ ఉగ్ర నెట్‌వర్క్ 
ఆ ఉగ్రవాదులంతా ఉన్నత విద్యావంతులే.. బైక్ దొంగల వెనుక భారీ ఉగ్ర నెట్‌వర్క్

Delhi : ఆ ఉగ్రవాదులంతా ఉన్నత విద్యావంతులే.. బైక్ దొంగల వెనుక భారీ ఉగ్ర నెట్‌వర్క్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 03, 2023
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఐసీస్ ఉగ్రవాదులని సోమవారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐసీసీ ఉగ్రవాదులందరూ ఉన్నత విద్యావంతులని దర్యాప్తులో తేలింది. ఈ విషయాన్ని దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సీనియర్ అధికారి హెచ్‌జీఎస్ దాలివాల్ పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున జైత్ పూర్‌లో కీలక నిందితుడైన షాన్‌వాజ్‌ తో పాటు మహ్మద్ రిజ్వాన్ అష్రాఫ్, మహ్మద్ అర్షద్ వార్సిని అరెస్టు చేశారు. ఇక ప్రధాన నిందితుడైన షానవాజ్ ఝార్ఖండ్‌లోని హజరీబాగ్ ప్రాంతానికి చెందినవాడు. అతడు మైనింగ్‌లో ఇంజనీరింగ్‌ని పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ బ్లాస్ట్‌లపై షాన్ వాజ్‌కు మంచి అనుభవం ఉంది. ఈ కేసులో మరో నిందితుడు అర్షద్ వార్సి అలీగఢ్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.

Details

రహస్య స్థావరాల ఏర్పాటు కోసం రెక్కీ 

ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్ గఢ్‌కు చెందిన మూడో నిందితుడు రిజ్వాన్ కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశాడు. రిజ్వాన్ మతగురువుగా కూడా శిక్షణను పొందాడు. దేశ వ్యాప్తంగా పాపులర్ వ్యక్తులను చంపేలా, అత్యధిక మంది మరణించేలా పేలుళ్లు జరపాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఐసీసీ మాడ్యుల్‌ను ఛేదించేందుకు ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయని దాలివాల్ పేర్కొన్నారు. నిన్న అరెస్టు చేసిన నిందితుల నుంచి ఓ తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నామని, షాన వాజ్ విదేశాల్లో తన ఐసిస్ హ్యాండ్లర్‌కు నిత్యం సమాచారం పంపేవాడని పోలీసులు చెప్పారు. ఇక షానవాజ్ అతని సన్నిహితులతో కలిసి కర్ణాటకలోని హుబ్బలి, ధార్వాడ్, గుజరాత్ లోని అహ్మదాబాద్ ప్రాంతాల్లో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి రెక్కీ నిర్వహించినట్లు తేలింది.

Details

కారు బాంబ్ కేసులో షాన్ వాజ్ హస్తం

షానవాజ్ మరో ఇద్దరితో కలిసి పుణేలో ఓ బైక్ దొంగతనానికి యత్నించాడు. ఈ కేసులో అక్కడి పోలీసులు జులైలో వారిని అరెస్టు చేయగా, అనంతరం పోలీసులు వారి ఇళ్లల్లో సోదాలు చేసేందుకు తీసుకెళ్లిన సమయంలో షానవాజ్ పోలీస్ వ్యాన్ దూకి పరారయ్యాడు. ఆ సమయంలో వారి ఇళ్లలో బాంబుల తయారీకి వాడే పదార్థాలు, బ్యాటరీలు, టైమర్లు, బల్పులు, షోల్డరింగ్ గన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇక మార్చిలో రాజస్థాన్‌లో దొరికిన కారు బాంబ్ కేసులో వీరి హస్తం ఉన్నట్లు గుర్తించారు.