
Rape: లిఫ్ట్ ఇచ్చి మహిళపై ఆత్యాచారానికి పాల్పడ్డ దుండగులు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
బస్సు కోసం వేచి ఉన్న 42 ఏళ్ల మహిళకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఇద్దరు యువకులు నమ్మించి, దారుణానికి పాల్పడ్డాడు.
పోలీసుల కథనం ప్రకారం, తంజావూర్ జిల్లాలోని పూతలూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
గత 3వ తేదీన పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లేందుకు పూతలూర్ బస్టాండ్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళను రాయందూర్‌కు చెందిన ప్రవీణ్ (32), రాజ్‌కపూర్ (26) అనే ఇద్దరు యువకులు ఆమెను చూసి లిఫ్ట్ ఇస్తామని నమ్మించారు.
Details
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
ప్రవీణ్ తన బైక్‌పై ఆమెను ఎక్కించుకొని తీసుకెళ్లగా, రాజ్‌కపూర్ మరో బైక్‌పై వెంబడించాడు.
పూతలూర్ దాటాక నిర్మానుష్య ప్రాంతంలో ఆపి, ఇద్దరూ ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గురువారం అరెస్టు చేశారు.