
Kerala Govt: రైతును చంపి తినేసిన పులి.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో ఓ పులి రైతును చంపి తినింది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
శనివారం ఓ పులి ప్రజేశ్ అనే రైతును చంపి అతడి మృతదేహాన్ని పాక్షికంగా తినేసింది.
పులి నరమాంసానికి అలవాటు పడినట్టు తేలితే దాన్ని చంపేయాలంటూ కేరళ ప్రభుత్వం అటవీశాఖకు అదేశాలు జారీ చేసింది.
ఈ ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
ఈ క్రమంలో నిరసనకు దిగిన స్థానికులు.. ప్రజేశ్ మృతదేహాన్ని తరలించేందుకు యత్నించిన పోలీసులను అడ్డుకున్నారు.
Details
పులి కోసం ముమ్మర గాలింపు
వయనాడు జిల్లాలో శనివారం ప్రజీష్ అనే వ్యక్తి పశువులకు గడ్డి కోసేందుకు వెళ్లగా అతనిపై ఓ పులి దాడి చేసింది.
ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన కేరళ ప్రభుత్వం ఆ పులి పట్టుకోవాలని ఆదేశాలను జారీ చేసింది.
ఒకవేళ ఆ పులి మనుషులను చంపి తినే రకమైతే ఆ పులి చంపేయాలంటూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఆ పులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
వివిధ ప్రాంతాల్లో 11 కెమరాలను ఏర్పాటు చేసి పులి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.