Page Loader
ముంబై హత్య: రెండు కట్టర్లతో శరీరాన్ని 20ముక్కలు చేశాడు; బాధితురాలు అనాథ 
ముంబై హత్య: రెండు కట్టర్లతో శరీరాన్ని 20ముక్కలు చేశాడు; బాధితురాలు అనాథ

ముంబై హత్య: రెండు కట్టర్లతో శరీరాన్ని 20ముక్కలు చేశాడు; బాధితురాలు అనాథ 

వ్రాసిన వారు Stalin
Jun 08, 2023
06:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై సమీపంలోని మీరా రోడ్ ప్రాంతంలో 32ఏళ్ల తన జీవిత భాగస్వామిని చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి, ఆ భాగాలను కుక్కర్‌లో ఉడికించిన నిందితుడిని పోలీసులు తమదైశైలిలో విచారిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. జీవిత భాగస్వామి సరస్వతి వైద్య శరీరాన్ని రెండు కట్టర్లను ఉపయోగించి 20కి పైగా ముక్కలుగా చేసినట్లు మనోజ్ తెలిపాడు. సరస్వతి వైద్యను మనోజ్ సానే 2014లో ఒక రేషన్ షాపులో కలిశాడు. 56 ఏళ్ల మనోజ్ సానే షాపులో పనిచేసేవాడు. అప్పడి నుంచి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త సహజీవనం వరకు వచ్చింది. అయితే సరస్వతి వైద్య అనాథ కావడం గమనార్హం.

ముంబై

ఆత్మహత్యగా మభ్యపెట్టే యత్నం

మనోజ్ సానే పెళ్లి చేసుకోలేదు. అతనికి బోరివలిలో ఒక ఇల్లు ఉంది. అక్కడ అతని కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. కానీ అతను తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. సానే, సరస్వతి వైద్య మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని పోలీసుల విచారణలో తేలింది. మూడేళ్లుగా అపార్డ్‌మెంట్‌లో ఉంటున్నా, చుట్టుపక్కల ఉన్న వారికి వీరు పేరు కూడా తెలియకపోడవం గమనార్హం. సరస్వతి చనిపోయాకే వీరి తమకు తెలిశాయని స్థానికులు చెబుతున్నారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో పోలీసులు అపార్ట్‌మెంట్‌లోని మనోజ్ ఫ్లాట్‌కు వెళ్లగా హత్య విషయం బయటపడింది. సరస్వతిని ఆదివారం హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంతటి ఘోరం చేసి కూడా సరస్వతి మరణం ఆత్మహత్యగా మనోజ్ చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం.