
Amaravati: అమరావతికి రూ.15వేల కోట్ల రుణసాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి విడతలోనే రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం రుణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)తో కలిసి ప్రపంచ బ్యాంకు మంజూరు చేయనుంది.
భవిష్యతులో మరింత ఆర్థిక సాయం అందించేందుకు కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.
ఇక ప్రపంచ బ్యాకు, ఏడీబీలకు చెందిన ప్రతినిధుల బృందం ఆగస్టు 19 నుంచి 27 వరకు రాజధానిలో పర్యటించనున్నారు.
Details
ఏడిబీతో కలిసి రుణం ఇచ్చేందుకు సిద్ధమైన ప్రపంచ బ్యాంకు
వారంతా వివిధ ఆంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులతో చర్చించనున్నారు.
ఇటీవల అమరావతిలో ప్రపంచ బ్యాంకుకు చెందిన నలుగురు సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమైనట్లు తెలిసింది.
2019కంటే ముందుగానే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
తొలి విడతలో రూ.3,500 కోట్ల ఇచ్చేందుకు ముందుకు రాగా, అంతలోనే ప్రభుత్వం మారడంతో నిధులు ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు.
కేంద్ర సూచలన మేరకే ఏడీబీతో కలిసి ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది