Page Loader
మూడు పిల్లలకు జన్మనిచ్చిన తెల్లపులి 'రక్ష'; వీడియో వైరల్
ముడు పిల్లలకు జన్మనిచ్చిన తెల్లపులి 'రక్ష'; వీడియో విడుదల చేసిన జూ అథారిటీ

మూడు పిల్లలకు జన్మనిచ్చిన తెల్లపులి 'రక్ష'; వీడియో వైరల్

వ్రాసిన వారు Stalin
Jun 13, 2023
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌ భిలాయ్‌లోని మైత్రి బాగ్ జూలో రక్ష అనే వైట్ టైగర్ మూడు పిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు. పులి నెలన్నర క్రితం పిల్లలకు జన్మనివ్వగా జూ అథారిటీ తాజాగా పిల్లల విజువల్స్‌ను విడుదల చేసింది. దీంతో ఆ వీడియో వైరలైంది. పులి పిల్లలకు ఇప్పుడు 1.5 నెలల వయస్సు ఉందని అధికారులు తెలిపారు. రక్ష, సుల్తాన్ పులులను 1997లో నందన్‌కానన్ జూలాజికల్ పార్క్ నుంచి తీసుకువచ్చారు. ఇవి ఇప్పటికే చాలా పిల్లలకు జన్మనిచ్చాయి. ఆ పులుల 12 పిల్లలను దేశంలోని వివిధ జంతు ప్రదర్శనశాలలకు పంపినట్లు మైత్రి బాగ్ జూ ఇన్‌ఛార్జ్ ఎన్‌కె జైన్ పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా పులుల మధ్య సంతానోత్పత్తిని నిలిపివేసినట్లు జైన్ వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జూ అధికారులు విడుదల చేసిన వీడియో