Page Loader
Coronavirus india: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వైరస్ సోకి ఐదుగురు మృతి.. 
Coronavirus india: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వైరస్ సోకి ఐదుగురు మృతి..

Coronavirus india: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వైరస్ సోకి ఐదుగురు మృతి.. 

వ్రాసిన వారు Stalin
Dec 18, 2023
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24గంటల్లో కరోనా కొత్త కేసులు 335 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,701కు పెరిగింది. అలాగే కోవిడ్ బారిన కొత్తగా 5మరణాలు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో నాలుగు మరణాలు కేరళలోనే నమోదు కావడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకరు చనిపోయారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి.. దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4.50 కోట్ల (4,50,04,816) మంది కరోనా బారిన పడ్డారు. 4.46 కోట్ల (4,44,69,799) మంది కోలుకున్నారు. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనా

కేరళలో కరోనా సబ్-వేరియంట్ JN. 1 

కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN.1ను గుర్తించారు. కేరళకు చెందిన 79 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ తెలిపారు. తిరువనంతపురం జిల్లాలోని కరకుళంలో ఈ కేసును గుర్తించినట్లు వెల్లడించారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కనుగొనబడిన సబ్-వేరియంట్ JN.1 గురించిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాజాగా మరణించిన ఐదుగురితో కలిసి దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 5,33,316 మంది మరణించారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్‌లు ఇచ్చారు.