తదుపరి వార్తా కథనం

Telangana Rains: తెలంగాణలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 14, 2025
03:39 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు స్థాయిలో వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు అధికారులు హెచ్చరించారు.
అదేవిధంగా, రానున్న మూడు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే సూచనలు ఉన్నాయని వెల్లడించారు.
ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ అధికమవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.