హిందూ మతమనేదే లేదు, అదంతా ఓ బూటకం.. స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
సమాజ్ వాదీ పార్టీకి చెందిన లీడర్ స్వామి ప్రసాద్ మౌర్య హిందూమతంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గతంలో రాంచరిత్ మానస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మౌర్య, మరోసారి హిందూ మతంపై నోరు జారారు. ప్రస్తుతం హిందూమతంపై ఆయన కామెంట్స్ కాంట్రవరీ అవుతున్నాయి.
హిందూయిజం అనేది లేదని, అదంతా ఓ బూటకమని మౌర్య పేర్కొన్నారు. కేవలం దళితులపై కుట్ర చేసేందుకు ఓ మతాన్ని సృష్టించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ హిందూ మంతం ఉండి ఉంటే, వెనుబడిన వర్గాలకు న్యాయం జరిగేదని తేల్చి చెప్పారు.
బ్రహ్మణిజం మూలాలు చాలా లోతుగా ఉన్నాయని, బ్రహ్మణిజాన్నే హిందూ మతంగా పిలుస్తున్నారని పేర్కొన్నారు.
Details
ప్రసాద్ మౌర్యపై మండిపడుతున్న హిందూ సంఘాలు
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా, రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును గుడికి వెళ్లకుండా అడ్డుకున్నారని, రాష్ట్రపతి సమక్షంలోనే ఉన్నత కులానికి చెందిన ఓ మంత్రి గుడిలోకి వెళ్లారని ప్రసాద్ మౌర్య వెల్లడించారు.
ఒక వేళ ఆమె నిజంగా హిందువుగా ఉండి ఉంటే ద్రౌపది ముర్ముకు ఇలా జరిగేది కాదని వివరించారు.
ఈ మేరకు స్వామి ప్రసాద్ మౌర్య తన ట్వీట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం హిందూ సంఘాలు ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
గతంలో కూడా రామ చరిత మానస్ లోని కొన్ని శ్లోకాలు కుల ప్రాతిపదికన ఓ వర్గాన్ని అవమానపరుస్తాన్నయని ప్రసాద్ మౌర్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్వామి ప్రసాద్ మౌర్య చేసిన ట్వీట్
ब्राह्मणवाद की जड़े बहुत गहरी है और सारी विषमता का कारण भी ब्राह्मणवाद ही है। हिंदू नाम का कोई धर्म है ही नहीं, हिंदू धर्म केवल धोखा है। सही मायने में जो ब्राह्मण धर्म है, उसी ब्राह्मण धर्म को हिंदू धर्म कहकर के इस देश के दलितों, आदिवासियों, पिछड़ों को अपने धर्म के मकड़जाल में… pic.twitter.com/351EJeSBlY
— Swami Prasad Maurya (@SwamiPMaurya) August 27, 2023