
Indians: అత్యధిక భారతీయులు నివసిస్తున్న టాప్ 10 దేశాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వలస నివేదిక 2024 ప్రకారం, అంతర్జాతీయ వలసదారుల సంఖ్య సుమారు 281 మిలియన్లుగా ఉంది. ఇందులో అత్యధికంగా ఉన్నవి భారతీయులే. దాదాపు 18 మిలియన్ల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. భారతీయ మూలాలు కలిగిన వారిని కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 35 మిలియన్లకు పైగా ఉంటుంది. అంత పెద్ద సంఖ్యలో భారతీయులు ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు? భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, అత్యధిక భారతీయులు ఉన్న టాప్ దేశాలు ఇవే:
Details
1. అమెరికా (USA)
5.4 మిలియన్లకు పైగా భారతీయులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇతర నైపుణ్యాలకు ఉన్న అవకాశాలు, మంచి వీసా పాలసీలు భారతీయులను ఆకర్షిస్తున్నాయి. న్యూజెర్సీ (ఎడిసన్), న్యూయార్క్ (జాక్సన్ హైట్స్), కాలిఫోర్నియా (ఆర్టీసియా) వంటి ప్రాంతాల్లో భారతీయుల వలస పట్టు బలంగా ఉంది. వీటిని లిటిల్ ఇండియాస్ అని కూడా పిలుస్తారు. 2. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఇక్కడ 3.57 మిలియన్లకు పైగా భారతీయులు ఉన్నారు. ముఖ్యంగా నిర్మాణం, ఆతిథ్య సేవలు, ఆర్థిక రంగాల్లో పనిచేస్తున్నారు. పన్ను లేకుండా జీతాలు అందుకోవడం, గల్ఫ్ దేశాల్లో ఉన్న పెద్ద మార్కెట్ కారణంగా UAE భారతీయులకు రెండో గమ్యంగా మారింది. దుబాయ్‌లో 70 శాతానికి పైగా కార్మికులు భారతీయులే.
Details
3. మలేసియా
ఇక్కడ 2.91 మిలియన్లకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. 19వ శతాబ్దం కాలంలో బ్రిటీష్ వలస రాజ్యాధినంలో చక్కెర, రబ్బరు తోటల్లో పని చేయడానికి వచ్చిన కూలీలు, నేడు అక్కడ 9% జనాభాలో భాగంగా ఉన్నారు. మలేసియాలో భారతీయులు ప్రభావశాలిగా మారారు. 4. కెనడా దాదాపు 2.88 మిలియన్ల భారతీయులు కెనడాలో ఉన్నారు. ముఖ్యంగా sటొరంటో (700,000 పైగా), వాంకోవర్‌లో భారతీయ సమాజం బలంగా ఉంది. పంజాబీ మార్కెట్లు, గురుద్వారాలు, బాలీవుడ్ సినిమాల ఉత్సవాలు తరచూ కనిపిస్తాయి.
Details
5. సౌదీ అరేబియా
ఇక్కడ 2.46 మిలియన్లకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. 2023-24లో ఈ సంఖ్యలో 2 లక్షల మంది పెరిగారు. నిర్మాణం, మౌలిక సదుపాయాలు, సేవల రంగాల్లో అవకాశాలు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం 3,000కు పైగా భారత సంస్థలు సౌదీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 6. యునైటెడ్ కింగ్‌డమ్ (UK) దాదాపు 1.86 మిలియన్ల భారతీయ సంతతి ప్రజలు UKలో ఉన్నారు. 1950లలో కార్మికుల కొరత, 1970ల తర్వాత వలసల పెరుగుదల ఇందుకు కారణం. లండన్, లీసెస్టర్, బర్మింగ్‌హామ్ వంటి నగరాల్లో వీరి ఉనికి మరింతగా కనిపిస్తుంది
Details
7. దక్షిణాఫ్రికా
సుమారు 1.7 మిలియన్ల భారతీయులు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. వీరిలో చాలా మంది 19వ శతాబ్దంలో చక్కెర తోటల పని కోసం తీసుకువచ్చిన కూలీల వారసులు. నేడు కేప్‌టౌన్, జోహాన్నెస్‌బర్గ్ వంటి నగరాల్లో స్థిరపడిపోయారు. 8. శ్రీలంక ఇక్కడ 1.61 మిలియన్లకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది తమిళులు. టీ తోటలు, పర్యాటకం, ఐటీ రంగాలలో పనిచేస్తున్నారు. తమిళ-సింహళ సాంస్కృతిక సమ్మేళనం, వలసల మార్పిడికి ఊతమిచ్చింది.
Details
9. కువైట్
దాదాపు 9.95 లక్షల మంది భారతీయులు కువైట్‌లో ఉన్నారు. ఇది ఆ దేశ జనాభాలో 20శాతానికి పైగా వీరు చమురు క్షేత్రాలు, ఆసుపత్రులు, నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్నారు. 10. ఆస్ట్రేలియా ఇక్కడ 9.76 లక్షల పైగా భారతీయులు నివసిస్తున్నారు. ప్రతి సంవత్సరం 1.2 లక్షల మంది విద్యార్థులు చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్, ఐటీ రంగ నిపుణులు ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. ప్రపంచంలోని ప్రతి మూలలో భారతీయుల ప్రభావం కనిపిస్తోంది. విద్య, ఉద్యోగం, జీవన స్థాయి మెరుగుదల కోసం వలస వెళ్లిన భారతీయులు ఇప్పుడు ఆ దేశాల్లో సాంస్కృతిక, ఆర్థిక మార్పులకు కారకులవుతున్నారు