Kolkata Doctor Case: నన్ను ఇరికిస్తున్నారు.. కోర్టులో నిందితుడి అవేదన
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య ఘటనలో కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది.
స్థానిక సీల్దా సెషన్స్ కోర్టు నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించింది. కోర్టు తీర్పు ఇస్తూ, నేను అన్ని ఆధారాలు, సాక్షులను పరిశీలించానని, వీటిని బట్టి నువ్వు నేరం చేసినట్లు రుజువైంది.
నువ్వు దోషివి, నీకు శిక్షపడాలని పేర్కొంది. సంజయ్ రాయ్‌కు శిక్షను సోమవారం ఖరారు చేయనున్నారు.
కోర్టు అత్యాచారం, హత్య, మరణానికి కారణమయ్యే సెక్షన్ల కింద దోషిగా నిర్ధారించింది.
Details
160 రోజుల తర్వాత తీర్పు
అయితే తీర్పు ప్రకటన సందర్భంగా సంజయ్ రాయ్ తనపై అక్రమంగా నేరాలు మోపారని, తనను ఇరికించినట్లు వాదించాడు.
తాను ఈ నేరం చేయలేదని, మరొకరిని ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నించాడు. దీనికి కోర్టు, శిక్ష నిర్ణయం ముందు సోమవారం అతడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పింది.
ఈ దారుణమైన సంఘటన ఆగస్టు 9న జరిగింది, నేరం జరిగిన 160 రోజులకు తర్వాత ఈ తీర్పు వెలువడింది.