Postmortem: ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం పూర్తి.. శరీరంపై 14కు పైగా గాయాలు
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో మహిళా ట్రైనీ డాక్టర్ హత్య, అత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టంలో కీలక విషయాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమె శరీరంపై 14కు పైగా గాయాలున్నాయని, ఇది క్రూరమైన పని అని, ముఖ్యంగా బాధితురాలు ప్రయివేటు భాగాలకు కూడా గాయాలలయ్యాయని చెప్పారు. ఈ గాయాలన్నీ ఆమె మరణానికి ముందు జరిగినవి అని ఓ నివేదక పేర్కొంది.
తల, ముఖం, మెడ, చేతులు, జననాంగాలపై గాయాలు
బాధితురాలి తల, ముఖం, మెడ, చేతులు, జననాంగాలపై 14కు పైగా గాయాలయ్యాయి. మరణానికి కారణం "స్మోదరింగ్‌తో సంబంధం ఉన్న మాన్యువల్ స్ట్రాంగులేషన్" అని నిర్ధారించారు. మృతి చెందిన తీరును హత్యగా ద్రువీకరించారు. ఊపిరితిత్తులలో రక్తస్రావం, శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించారు. ఈ హత్యాచార ఘటనలో సంజోయ్ రాయ్ అరెస్టయ్యాడు. తర్వాత ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. ఇదిలావుండగా, ఈ కేసును సుప్రీంకోర్టు స్వయంగా స్వీకరించి ఆగస్టు 20న విచారించనుంది.