Nirmala Sitharaman: భారీగా పన్ను మినహాయించడానికి కారణమిదే.. నిర్మాలా సీతారామన్ వివరణ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించారు.
ఫిబ్రవరి 4న ఓ టీవీ ఛానల్‌తో చేసిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై వివరణ ఇచ్చారు.
గత మూడు, నాలుగు సంవత్సరాలుగా తాము పన్ను చెల్లించేవారితో మాట్లాడుతున్నామని, వారు పన్ను చెల్లించే విషయంలో ప్రభుత్వం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారన్నారు.
ఈ సందర్భంలో వారికి గౌరవం తెలుపడమే ప్రధానమంత్రి మోదీ నిర్ణయమన్నారు.
పాత పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు కోరుకునే వారికోసం కూడా అందుబాటులో ఉంచామని ఆమె తెలిపారు.
Details
శ్లాబులను తగ్గిస్తున్నట్లు ప్రకటన
కొత్త ఆదాయ పన్ను చట్టం పన్ను ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందన్నారు.
1961 సంవత్సరం పన్ను చట్టం చాలా క్లిష్టమైందన్నారు. పన్ను చెల్లింపుదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆమె వివరించారు.
ఈ కొత్త పన్ను విధానంలో, రూ.12 లక్షల దాకా ఆదాయం ఉన్న వ్యక్తులకు పన్ను మినహాయింపు అందించనున్నట్టు, బడ్జెట్‌లో ఇటీవల ప్రకటించారు.
అదనంగా రూ.75వేలు స్టాండర్డ్ డిడక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయ పన్ను శ్లాబులను తగ్గించినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది.