NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / OYO: ఈ ఏడాది ఓయో బుకింగ్స్‌లో 'హైదరాబాద్' అగ్రస్థానం.. తర్వాతి నగరమిదే?
    తదుపరి వార్తా కథనం
    OYO: ఈ ఏడాది ఓయో బుకింగ్స్‌లో 'హైదరాబాద్' అగ్రస్థానం.. తర్వాతి నగరమిదే?
    ఈ ఏడాది ఓయో బుకింగ్స్‌లో 'హైదరాబాద్' అగ్రస్థానం.. తర్వాతి నగరమిదే?

    OYO: ఈ ఏడాది ఓయో బుకింగ్స్‌లో 'హైదరాబాద్' అగ్రస్థానం.. తర్వాతి నగరమిదే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 25, 2024
    05:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024 సంవత్సరం ముగియేందుకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాది ఆఖరులో ఓయో తన నివేదికను విడుదల చేసింది.

    ట్రావెలోపీడియా 2024 నివేదిక ప్రకారం భారతదేశంలో మతపరమైన పర్యాటకానికి ఈ సంవత్సరం ప్రత్యేక ప్రాధాన్యత దక్కింది.

    పూరీ, వారణాసి, హరిద్వార్‌ వంటి ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలు ఈ సంవత్సరం చర్చనీయాంశంగా నిలిచాయి.

    అలాగే దేవఘర్, పళని, గోవర్ధన్‌లలో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది.

    బుకింగ్స్‌లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది, తర్వాత బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా వంటి నగరాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి.

    Details

    ముంబైలో బుకింగ్స్ తగ్గుముఖం

    ఉత్తరప్రదేశ్‌ ప్రయాణానికి అత్యధికంగా ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా నిలిచింది.

    మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు పర్యాటకులకు అనుకూలంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. పాట్నా, రాజమండ్రి, హుబ్లీ వంటి చిన్న నగరాల్లో బుకింగ్స్ 48 శాతం వరకు పెరిగాయి.

    ఈ ఏడాది సెలవుల సమయంలో ప్రయాణ కార్యకలాపాలు పెరిగినట్లు ఓయో తెలిపింది. గోవా, పుదుచ్చేరి, మైసూర్ వంటి ఎవర్‌గ్రీన్ గమ్యస్థానాలతో పాటు జైపూర్ పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది.

    అయితే, ముంబైలో బుకింగ్స్ తగ్గుముఖం పట్టాయి. ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీసెస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్‌బోలే ఈ ఏడాది పర్యాటక రంగంలో అభివృద్ధి సాధించామని తెలిపారు.

    Details

    ఓయో సీఈఓగా రితేశ్ అగర్వాల్

    పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత కోసం చాలా మంది తమ ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లినట్లు కూడా చెప్పారు.

    2012లో స్థాపించిన ఓయో, భారత స్టార్టప్ కంపెనీలలో ఒక సంచలనం సృష్టించింది.

    ఇప్పుడు ఏ చిన్న పట్టణంలోనైనా ఓయో రూమ్స్ అందుబాటులో ఉంటాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు రాత్రి బస చేయాల్సినప్పుడు ఓయోనే గుర్తుకు వస్తుంది.

    ఈ సంస్థ అభివృద్ధి వెనుక ఓ యువకుడి కృషి, పట్టుదల ఉంది. ఆ యువకుడు రితేశ్‌ అగర్వాల్, ప్రస్తుతం ఓయో సీఈఓగా కొనసాగుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం
    ఇండియా

    తాజా

    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా

    పర్యాటకం

    రాజస్థాన్‌లో ప్రకృతి సౌందర్యం.. వర్షాకాలంలో టాప్ టూరిజం ప్రాంతాలివే రాజస్థాన్
    ట్రావెల్: విశాఖపట్నం వెళ్తున్నారా? ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం మర్చిపోకండి  జీవనశైలి
    గుజరాత్ వెళ్తున్నారా? జీఐ ట్యాగ్ పొందిన వస్తువులు కొనండి  గుజరాత్
    టర్కీ పర్యటనకు వెళ్తున్నారా? ఈ ఆహారాలు ఖచ్చితంగా ట్రై చేయండి  టర్కీ

    ఇండియా

    Vizag: విశాఖ విమానాశ్రయంలో సంచలనం.. థాయ్‌లాండ్‌ నుంచి అక్రమంగా తెచ్చిన బల్లులు పట్టివేత  విశాఖపట్టణం
    PAN 2.0: పాన్ 2.0.. పాత కార్డులు కొనసాగుతాయా? ఐటీ శాఖ క్లారిటీ! కేంద్ర ప్రభుత్వం
    Massive Fire: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్
    TGPSC: టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025