
గాజా ఆస్పత్రిపై దాడిపై ప్రధాని మోదీ విచారం.. కారకులను వదిలిపెట్టొద్దని ట్వీట్
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిపై సామాన్యుల చనిపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
సామాన్యుల ప్రాణాలను హరించిన వారు ఎవరైనప్పటికీ వారిని విడిచిపెట్టవద్దని అన్నారు.
గాజాలోని అల్-అహ్లీ హాస్పిటల్‌పై మంగళవారం జరిగిన వైమానిక దాడిలో సుమారు 500 మంది పౌరులు మరణించారు.
ఈ ఘటనపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ యుద్ధంలో సామాన్యులు మరణించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం అన్నారు.
గాజా
దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి
గాజా ఆస్పత్రిపై మంగళవారం అర్థరాత్రి వైమానిక దాడి జరిగింది. పాలస్తీనాలోని హమాస్ నియంత్రణలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇక్కడ ఉన్న 500 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో ఆస్పత్రిపై దాడి చేసింది.. ఇజ్రాయెల్ అనే పాలస్తీనా మీడియా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు గాజా ఆస్పత్రిపై దాడిని తీవ్రంగా ఖండించాయి.
ఈ దాడిలో సామాన్యులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశాయి.
గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడిలో వందలాది మంది పాలస్తీనియన్లు మరణించడంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విచారం వ్యక్తం చేశారు.