Page Loader
US Consulate: ముంబైలోని అమెరికన్ కాన్సులేట్‌ను పేల్చేస్తాం: బెదిరింపు మెయిల్
US Consulate: ముంబైలోని అమెరికన్ కాన్సులేట్‌ను పేల్చేస్తాం: బెదిరింపు మెయిల్

US Consulate: ముంబైలోని అమెరికన్ కాన్సులేట్‌ను పేల్చేస్తాం: బెదిరింపు మెయిల్

వ్రాసిన వారు Stalin
Feb 11, 2024
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న యూఎస్ కాన్సులేట్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించారు. అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని పేల్చివేస్తామని ఈ బెదిరింపు మెయిల్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా అమెరికా పౌరులను చంపడమే తన లక్ష్యం అంటూ అందులో పేర్కొన్నాడు. అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంపై బాంబులు వేస్తామని బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం దర్యాప్తును ప్రారంభించింది. ఫిబ్రవరి 9 తెల్లవారుజామున 3.50 గంటలకు rkgtrading777@gamil.com నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు అమెరికా కాన్సులేట్‌కు భద్రతను పెంచారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేసు నమోదు చేసిన పోలీసులు