Threatening call to RBI: రిజర్వ్ బ్యాంక్ మూసివేయాలని బెదిరింపు కాల్.. విచారణ ప్రారంభించిన పోలీసులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ నంబర్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. శనివారం ఉదయం 10 గంటల సమయంలో, ఫోన్ చేసిన వ్యక్తి తాను లష్కరే తోయిబా సీఈఓ అని చెప్పి, బ్యాంకును మూసివేయాలని హెచ్చరించాడు. ఈ బెదిరింపును సీరియస్‌గా తీసుకుని , రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై మాతా రమాబాయి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, పోలీసులు విచారణ ప్రారంభించారు.
గతంలో జేఎస్‌ఏ న్యాయ సంస్థకి బాంబు బెదిరింపు ఇమెయిల్
ఇదిలా ఉండగా, నవంబర్ 14న గురువారం ముంబైలోని జేఎస్‌ఏ న్యాయ సంస్థకి బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. బెదిరింపు మెయిల్‌లో ఫర్జాన్ అహ్మద్ అనే పేరు కనిపించింది. జేఎఫ్‌ఏ సంస్థ కార్యాలయం, బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయాల్లో బాంబులు పెట్టినట్లు పేర్కొన్నాడు. పోలీసులు ఈ ఘటనపై వెంటనే విచారణ ప్రారంభించారు.