LOADING...
Nobel Prize 2025: వైద్య విభాగంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్
వైద్య విభాగంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్

Nobel Prize 2025: వైద్య విభాగంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2025
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక 'నోబెల్ పురస్కారాలను' జ్యూరీ ప్రకటిస్తోంది. మొదటగా, వైద్య విభాగానికి సంబంధించిన నోబెల్ పురస్కారాలను సోమవారం ప్రకటించారు. వైద్య శాస్త్రంలో చేసిన విశేష కృషి కోసం ప్రముఖ శాస్త్రవేత్తలు 'మేరీ ఇ. బ్రున్‌కో' ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమన్ సకాగుచీకు నోబెల్ పురస్కారం లభించనుందన్నట్లు నోబెల్ జ్యూరీ తెలిపింది. వైద్య విభాగంతో ప్రారంభమైన నోబెల్ పురస్కారాల ప్రదానం ఈ నెల 13 వరకు కొనసాగుతుంది. పలు రంగాల్లో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రతిష్టాత్మక అవార్డులు ప్రతి సంవత్సరం అందజేయబడతాయి.

Details

అమెరికా, జపాన్ శాస్త్రవేత్తలు 

మేరీ ఇ. బ్రున్‌కో, ఫ్రెడ్ రామ్స్‌డెల్ (అమెరికా), షిమన్ సకాగుచీ (జపాన్) రోగనిరోధక వ్యవస్థను ఎలా అదుపులో ఉంచుతారనే అంశంపై పరిశోధన చేసి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. నోబెల్ జ్యూరీ ప్రకారం పరిధీయ రోగనిరోధక సహనానికి (peripheral immune tolerance) సంబంధించిన వారి ఆవిష్కరణలు కొత్త పరిశోధనా రంగానికి పునాది వేసాయి. వీటి ద్వారా క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు వంటి కొత్త చికిత్సల అభివృద్ధికి దోహదపడింది.

Details

నోబెల్ బహుమతుల విశేషాలు

నోబెల్ బహుమతులు ప్రతి సంవత్సరం భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, వైద్యశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, అలాగే ప్రపంచ శాంతికి కృషిచేసిన సామాజికవేత్తలకు ఇవ్వనున్నారు. ఈ ఐదు బహుమతులు ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895లో వ్రాసిన వీలునామా ప్రకారం 1901లో ప్రారంభమయ్యాయి. విజేతలను వివిధ నిపుణుల కమిటీలు ఎంపిక చేస్తాయి. మిగతా పురస్కారాల వివరాలను త్వరలో ప్రకటించే ఏర్పాట్లు జరుగుతున్నాయి