Page Loader
Madhya Pradesh: చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి,ఇద్దరికి గాయాలు 
చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి,ఇద్దరికి గాయాలు

Madhya Pradesh: చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి,ఇద్దరికి గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2024
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్ లోని దామోహ్ పటేరా ప్రాంతం సమీపంలో కారు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత ఐదుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు జిల్లా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గాయపడిన ఇద్దరికి దామోలోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. "పటేరా సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. మొత్తం ముగ్గురు ఆసుపత్రిలో మరణించారు...",అని పటేరా, SHO అమిత్ గౌతమ్ చెప్పారు. మృతులకు పోస్టుమార్టం మంగళవారం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చెట్టును ఢీకొన్న కారు ఇదే..