Page Loader
Iran: ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి 
ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి

Iran: ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో ఇటీవల అదృశ్యమైన ముగ్గురు భారతీయులు సురక్షితంగా ఉన్నారని, టెహ్రాన్ పోలీసులు వారిని రక్షించారని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సమాచారం తెలియడంతో బాధితుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ముగ్గురిలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన హుషన్‌ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్‌బీఎస్ నగర్), అమృతపాల్ సింగ్ (హోషియార్‌పూర్) ఉన్నారు. వీళ్లు మే 1న హోషియార్‌పూర్‌లోని ఓ ఏజెంట్ సాయంతో ఇరాన్‌కు వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లిన వెంటనే దుండగులు వారిని అపహరించి తాళ్లతో కట్టి, వారి కుటుంబ సభ్యులకు ఫొటోలు పంపిస్తూ రూ. కోటి డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు.

వివరాలు 

ఇరాన్‌కు పంపించిన ఏజెంట్ కూడా మిస్ 

ఇక మే 11 నుంచి అయితే ఎలాంటి సమాచారం లేదు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. వెంటనే ఎంబసీ అధికారులు స్పందించి,ఇరాన్ అధికారులకు వివరాలు అందజేశారు. అదృష్టవశాత్తూ ఇరాన్ పోలీసులు చర్యలు తీసుకొని వారిని రక్షించారు. ఇదే సమయంలో హోషియార్‌పూర్‌కు చెందిన వారిని ఇరాన్‌కు పంపించిన ఏజెంట్ కూడా మిస్సయ్యాడు, ఇది కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళనకు దారి తీసింది. ఇకపోతే,ముగ్గురు యువకులు సురక్షితంగా ఉన్నారన్న సమాచారం రావడంతో వారి కుటుంబ సభ్యులందరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. టెహ్రాన్ పోలీసులు ఓ రహస్య రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వీరిని కాపాడినట్టు సమాచారం. అయితే,వారిని ఎవరు కిడ్నాప్ చేశారు?ఎందుకు కిడ్నాప్ చేశారు?అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రాలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత్ లోని ఇరాన్ ఎంబసీ చేసిన ట్వీట్