Loading...
Italians: ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే మ్యూనిచ్ వెళ్లిన ముగ్గురు ఇటాలియన్లు
ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే మ్యూనిచ్ వెళ్లిన ముగ్గురు ఇటాలియన్లు

Italians: ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే మ్యూనిచ్ వెళ్లిన ముగ్గురు ఇటాలియన్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తికాకుండానే ముగ్గురు ఇటాలియన్ పౌరులు భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లిపోయిన ఘటన దిల్లీ ఎయిర్‌పోర్టులో వెలుగుచూసింది. సరైన అనుమతులు లేకుండానే వారు అంతర్జాతీయ విమానం ఎక్కడంపై విమానాశ్రయ భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర విమానయాన శాఖ దర్యాప్తు చేపట్టింది. అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీకి.. ఇటలీకి చెందిన ముగ్గురు పౌరులు భారత్‌లో పర్యటించారు. అనంతరం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నుంచి ఎయిరిండియా విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. సెప్టెంబరు 3-4 మధ్య రాత్రి 12.50 గంటలకు వారు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సుమారు గంట తర్వాత లుఫ్తాన్సా విమానంలో ఢిల్లీ నుంచి జర్మనీలోని మ్యూనిచ్‌కు బయలుదేరారు.

వివరాలు 

ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే..

విదేశీ ప్రయాణికులు అంతర్జాతీయ విమానం ఎక్కే ముందు తప్పనిసరిగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.

ఇందులో భాగంగా పాస్‌పోర్టు, ఇతర ప్రయాణ పత్రాలను అధికారులు పరిశీలించడంతోపాటు అవసరమైన తనిఖీలు నిర్వహించి అనుమతి ఇవ్వాలి.

అయితే, ఈ ముగ్గురు ఇటాలియన్ ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ జరిగినట్లు ఆధారాలు లేవు.

సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రక్రియ పూర్తికాకుండానే వారు దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

వివరాలు 

నిబంధనలకు విరుద్ధంగా బోర్డింగ్ పాసులు

దేశీయ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు విదేశాలకు వెళ్లాలంటే అక్కడ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

లగేజ్ తనిఖీ, పాస్‌పోర్టు, ఇతర పత్రాల పరిశీలన అనంతరం మాత్రమే తదుపరి ప్రయాణానికి అనుమతి ఇవ్వాలి.

అయితే, ఈ ముగ్గురు ప్రయాణికులకు అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలోనే దేశీయ విమానానికి సంబంధించిన బోర్డింగ్ పాసులు ఇచ్చారు.

అంతేకాకుండా లుఫ్తాన్సా అంతర్జాతీయ విమానానికి సంబంధించిన బోర్డింగ్ పాసులు కూడా జారీ చేశారు.

వాస్తవానికి ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే అంతర్జాతీయ విమానానికి బోర్డింగ్ పాస్ ఇవ్వాలి. కానీ, వారు నేరుగా అంతర్జాతీయ ప్రాంతానికి వెళ్లి విమానం ఎక్కినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసులు

ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యంతోపాటు ఎయిర్ ఇండియా సంస్థ పాత్రపైనా ప్రశ్నలు తలెత్తాయి.

ప్రయాణికుల బోర్డింగ్, కనెక్టింగ్ విమానాల ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారాన్ని కేంద్ర విమానయాన శాఖ తీవ్రంగా పరిగణించింది. ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ప్రస్తుతం ఈ అంశంపై విచారణ కొనసాగుతోంది.

ADVERTISEMENT