Page Loader
Helicopter Crash: పుణే జిల్లాలో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మరణం
పుణే జిల్లాలో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మరణం

Helicopter Crash: పుణే జిల్లాలో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మరణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2024
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు ఇంజినీర్లు మరణించారు. పూణేలోని బవ్‌ధాన్ బుద్రుక్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలడంతో మంటలు చెలరేగి, ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఇచ్చిన ప్రకటన ప్రకారం, హెలికాప్టర్ ప్రభుత్వానిదా లేదా ప్రైవేట్‌దా అనేది ఇంకా తెలియరాలేదని చెప్పారు.

Details

మృతుల వివరాలు తెలియాల్సి ఉంది

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం తక్కువ దృశ్యమానత ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. బవ్‌ధాన్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారని అధికారులు వెల్లడించారు. మంటల్లో కూరుకుపోయిన హెలికాప్టర్‌ ఎవరిదీ అన్నది ఇంకా స్పష్టతకు రాలేదని అన్నారు.