Page Loader
Maoists encounter : మావోస్టులకు మరో ఎదురదెబ్బ.. భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి
మావోస్టులకు మరో ఎదురదెబ్బ.. భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Maoists encounter : మావోస్టులకు మరో ఎదురదెబ్బ.. భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున భద్రతా దళాలు మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ ఇచ్చాయి. జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొని ముగ్గురు మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఈ ఘటనలో సెంట్రల్‌ కమిటీకి చెందిన గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ సహా, జోనల్‌ కమిటీ సభ్యురాలు అరుణ, మరో మావోయిస్టు మరణించినట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్న వెంటనే మిగిలిన మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయినట్టు సమాచారం. మరోవైపు ఇంకా కొన్ని మావోయిస్టు గుంపులు ఆ అడవుల్లో ఉన్నారన్న అనుమానంతో, మారేడుమిల్లి అడవులలో గ్రేహౌండ్స్‌ బలగాలు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.