Loading...
Amaravati Reservoirs: అమరావతిలో మూడు భారీ రిజర్వాయర్లు.. వర్షాలతో నిండుకుండల్లా జలాశయాలు!
అమరావతిలో మూడు భారీ రిజర్వాయర్లు.. వర్షాలతో నిండుకుండల్లా జలాశయాలు!

Amaravati Reservoirs: అమరావతిలో మూడు భారీ రిజర్వాయర్లు.. వర్షాలతో నిండుకుండల్లా జలాశయాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజధాని అమరావతిలో వరద నియంత్రణకు కీలకమైన నీరుకొండ, శాఖమూరు, పెనుమాక రిజర్వాయర్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఈ మూడు రిజర్వాయర్లలోకి నీరు చేరింది. దీంతో నిర్మాణంలో ఉన్న జలాశయాలు ప్రస్తుతం నిండుకుండలను తలపిస్తున్నాయి.

వివరాలు

440 ఎకరాల్లో నీరుకొండ రిజర్వాయర్

అమరావతిలో 440 ఎకరాల విస్తీర్ణంలో నీరుకొండ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాజధానిలో నిర్మిస్తున్న మూడు రిజర్వాయర్లలో ఇదే అతిపెద్దది.

మురసు, అర్నబ్‌ తుపానుల కారణంగా కొండవీటివాగు, కొటెళ్లవాగు ద్వారా వచ్చిన నీటిని ఈ రిజర్వాయర్‌లో నిల్వ చేశారు.

ఇప్పటివరకు 85 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రిజర్వాయర్‌ చుట్టూ 158 ఎకరాల్లో ల్యాండ్‌స్కేప్‌ గ్రీనరీతో పాటు బహుళ ప్రయోజనాలతో కూడిన ఉద్యానవనాలను అభివృద్ధి చేయాల్సి ఉంది.

ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 0.4 టీఎంసీలు.

వివరాలు

సెంట్రల్‌ పార్కులో శాఖమూరు రిజర్వాయర్

300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న సెంట్రల్‌ పార్కు మధ్యలో 50 ఎకరాల్లో శాఖమూరు రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు.

దీనికి శాఖమూరు చెరువును కూడా అనుసంధానం చేయనున్నారు. రిజర్వాయర్‌లోకి నీరు చేరేందుకు అవసరమైన కాలువల అనుసంధాన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

ఈ ప్రాంతంలో యోగా కేంద్రం, జిమ్‌ వంటి సదుపాయాలను సైతం ఏర్పాటు చేయనున్నారు. శాఖమూరు రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం 0.03 టీఎంసీలు.

ADVERTISEMENT

వివరాలు

190 ఎకరాల్లో పెనుమాక రిజర్వాయర్

పెనుమాకలో 190 ఎకరాల విస్తీర్ణంలో మరో రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు.

దీని నీటి నిల్వ సామర్థ్యం 0.1 టీఎంసీలు. కొండవీటివాగు, పాలవాగు నుంచి వచ్చే నీరు ఈ రిజర్వాయర్‌లో కలుస్తుంది. ఇప్పటివరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి.

భూసేకరణ పెండింగ్‌లో ఉండటంతో నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. ఈ రిజర్వాయర్‌ చుట్టూ కూడా పచ్చదనాన్ని అభివృద్ధి చేయనున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు నిర్మాణ ప్రదేశంలోకి నీరు చేరింది.

ADVERTISEMENT