LOADING...
Andhra: 3 కొత్త జిల్లాలకు నోటిఫికేషన్‌ విడుదల.. మార్పుచేర్పులపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ
మార్పుచేర్పులపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ

Andhra: 3 కొత్త జిల్లాలకు నోటిఫికేషన్‌ విడుదల.. మార్పుచేర్పులపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం గురువారం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్ల పరిధిలోని కొన్ని మండలాలను ఇతర డివిజన్లలోకి మార్చింది. పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ గ్రామానికి 'వాసవీ పెనుగొండ' అనే పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. అలాగే, కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విడదీసి పెద్దహరివాణం కేంద్రంగా కొత్త మండలాన్ని ప్రకటించింది. ఈ మార్పులన్నింటికి సంబంధించి జిల్లాలవారీగా ప్రాథమిక నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు పంపారు.

వివరాలు 

ప్రకాశం జిల్లాలోకి కందుకూరు, అద్దంకి 

ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు 30 రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌కు అందజేయాలని స్పష్టం చేశారు. డిసెంబరు చివరి నాటికి విభజన ప్రక్రియను ముగించి, తుదినోటిఫికేషన్‌ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కందుకూరు, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లా పరిధిలో చేర్చారు. కందుకూరు రెవెన్యూ డివిజన్‌లో కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం, మర్రిపూడి, పొన్నలూరు మండలాలు ఉంటాయి. కొత్త అద్దంకి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జె.పంగులూరు, కొరిశపాడు, ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, దొనకొండ, కురిచేడు మండలాలు చేర్చబడ్డాయి.

వివరాలు 

ప్రకాశం జిల్లాలోకి కందుకూరు, అద్దంకి 

మండపేట, రాయవరం,కపిలేశ్వరపురం మండలాలను అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్‌ పరిధి నుంచి తీసి,తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం డివిజన్‌ అధికార పరిధిలో చేర్చారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొండాపురం, వరికుంటపాడు మండలాలు కావలి రెవెన్యూ డివిజన్‌లో విలీనం అయ్యాయి. అలాగే ఆత్మకూరు డివిజన్‌లో ఉన్న కలువాయి మండలం,నెల్లూరు డివిజన్‌లోని సైదాపురం,రాపూరు మండలాలను తిరుపతి జిల్లా గూడూరు డివిజన్‌కు మార్చారు. వైఎస్సార్‌ కడప జిల్లా పరిధిలోని కడప రెవెన్యూ డివిజన్‌కు చెందిన ఒంటిమిట్ట,సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్‌లో చేర్చారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని రెండు భాగాలుగా విభజించి కొత్తగా పెద్దహరివాణం మండలాన్ని ఏర్పాటు చేశారు.దీని ఫలితంగా ఆదోని మండలంలో 29 గ్రామాలు,కొత్త పెద్దహరివాణం మండలంలో 17 గ్రామాలు ఉండనున్నాయి.

Advertisement

వివరాలు 

ప్రకాశం జిల్లాలోకి కందుకూరు, అద్దంకి 

పుట్టపర్తి డివిజన్‌ లోని గోరంట్ల మండలాన్ని పెనుకొండ డివిజన్‌కు మార్చగా, కదిరి డివిజన్‌లోని ఆమడగూరు మండలాన్ని పుట్టపర్తి డివిజన్‌లోకి చేర్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్‌కు చెందిన బంగారుపాళ్యం మండలం ఇకపై చిత్తూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్‌లోని నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్‌ పరిధిలోకి మార్చారు. సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్‌ నుంచి పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌లో చేర్చారు.

Advertisement

వివరాలు 

రామచంద్రపురం డివిజన్‌లో ఇక రెండు మండలాలే 

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయనున్న నేపథ్యంలో, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు రాజమహేంద్రవరం డివిజన్‌లో చేరనున్నాయి. ఇవి విడిపోవడంతో రామచంద్రపురం డివిజన్‌ పరిధిలో ఇప్పుడు రామచంద్రపురం, కె.గంగవరం మండలాలే మిగిలాయి. ఈ డివిజన్‌ను ఇలాగే కొనసాగిస్తారా? లేక మిగిలిన రెండు మండలాలను మరో డివిజన్‌లో కలిపేస్తారా? అనే చర్చ అక్కడ జోరుగా సాగుతోంది.

వివరాలు 

కొత్త జిల్లాలు, వాటి పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, మండలాలు 

మార్కాపురం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజన్‌: గిద్దలూరు, బేస్తవారపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు, మార్కాపురం, తర్లుపాడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, పొదిలి, కొనకనమిట్ల. కనిగిరి రెవెన్యూ డివిజన్‌: హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి (పీసీపల్లి), చంద్రశేఖరపురం (సీఎస్‌పురం), పామూరు. పోలవరం జిల్లా జిల్లా కేంద్రం: రంపచోడవరం రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌: రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి. చింతూరు రెవెన్యూ డివిజన్‌: ఎటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం.

వివరాలు 

కొత్త జిల్లాలు, వాటి పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, మండలాలు 

మదనపల్లె జిల్లా మదనపల్లె రెవెన్యూ డివిజన్‌: మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, చౌడేపల్లి, పుంగనూరు. కొత్త పీలేరు రెవెన్యూ డివిజన్‌: సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె, కలికిరి, వాల్మీకిపురం.

Advertisement