Manipur: మణిపూర్ లో మరోసారి హింస..ముగ్గురు మృతి..30మందికి పైగా గాయాలు
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది.కూకీ వర్గానికి చెందిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ శ్యాం లాల్ సస్పెండ్ ను వ్యతిరేకిస్తూ..మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ ఎస్పీ ఆఫీసును ప్రజలు ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే క్రమంలో ముగ్గురు మృతి చెందగా,30మందికి పైగా గాయపడ్డారు. అయితే.. శ్యాం లాల్..సాయుధ వ్యక్తులతో ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో అతడిని ఉద్యోగం నుండి తొలగించారు. "సుమారు 300-400 మందితో కూడిన గుంపు ఈరోజు SP CCP కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించి, రాళ్లురువ్వారని " మణిపూర్ పోలీసులు X లో తెలిపారు. "RAFతో సహా SF (భద్రతా దళాలు) పరిస్థితిని నియంత్రించడానికి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడం ద్వారా తగిన విధంగా ప్రతిస్పందిస్తోంది. విషయాలు పరిశీలనలో ఉన్నాయి" అని పోలీసులు తెలిపారు.
ఇంటర్నెట్ సేవలపై ఐదు రోజుల నిషేధం
మణిపూర్ ప్రభుత్వం మరోసారి ఇంటర్నెట్ సేవలపై ఐదు రోజుల నిషేధాన్ని అమలు చేసింది. జాయింట్ సెక్రటరీ (హోమ్) జారీ చేసిన నోటీసు ప్రకారం,శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా,సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎటువంటి తప్పుడు సమాచారం లేదా ఇతర రకాల హింసాత్మక కార్యకలాపాల వ్యాప్తి, చెయ్యకూడదని పేర్కొంది. చురచంద్‌పూర్ జిల్లాలో శాంతిభద్రతల అస్థిర పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం చురచంద్‌పూర్ జిల్లా మొత్తం రెవెన్యూ పరిధిలో ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్/డేటా సేవలు, ఇంటర్నెట్/డేటా సేవలను VPN ద్వారా తాత్కాలికంగా నిలిపివేయాలని/అరికట్టాలని నిర్ణయించింది.