Page Loader
కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే 
కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే

కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే 

వ్రాసిన వారు Stalin
Jun 13, 2023
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న మేడ్చల్ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఇద్దరు కొత్త పెళ్లైన జంట కావడం గమనార్హం. ఈ రెండు సంఘటనలు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి. ఆరు నెలల క్రితం వివాహమైన ఓ జంట కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని అంజి (25), వైష్ణవి (22)గా గుర్తించారు. అహ్మద్‌గూడ రాజీవ్‌ గృహకల్ప వద్ద ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. పెళ్లైన ఆరునెలలకే భార్య, భర్తలు చనిపోవడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

తెలంగాణ

ఉరి వేసుకొని మరో వ్యక్తి ఆత్మహత్య 

మరో ఘటనలో నరసింహ(38) కరీంగూడ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రెండు కేసుల్లోని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం పోలీసులు తరలించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక, తదుపరి విచారణ చేపడుతామని పోలీసులు వెల్లడించారు.