తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) ఏడాదిలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేక దర్శనాన్ని ప్రవేశపెట్టింది.
అంతేకాకుండా వృద్ధులు, శారీరక, మానసిక దివ్యాంగులకు కూడా ఈ ప్రత్యేక దర్శన సదుపాయాన్ని కల్పిస్తోంది.
ఏడాదిలోపు పిల్లలతో వచ్చిన తల్లదండ్రులు, వృద్ధులు వికలాంగులు గంటల తరబడి నిరీక్షించే పని లేకుండా వారిని నేరుగా స్వామివారి దర్శనానికి పంపేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
ఇందుకోసం టీటీడీ ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసింది. అయితే ప్రత్యేక దర్శనాన్ని సదుపాయం కావాలంటే వీరు కొన్ని నియమ, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
టీటీడీ
ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరం
కలియుగ దైవ శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనానికి వెళ్లే ఏడాదిలోపు వయసున్న చిన్నారి తల్లితండ్రులు తమ పిల్లల ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకెళ్లాల్సి ఉంటుది.
డేట్ ఆఫ్ సర్టిఫికెట్ లేకపోతే, ఆస్పత్రిలో డిశ్చార్జి సమయంలో ఇచ్చిన పత్రాన్ని తీసుకెళ్లాలి.
అయితే అన్ని ఒరిజినల్ పత్రాలను మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది.
అలాగే తల్లిదండ్రుల ఆధార్, ఓటర్ వంటివి కూడా టీటీడీ అధికారులకు సమర్పించాలి. వికలాగంగులు, వృద్ధులు కూడా ఒరిజినల్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
అయితే ఈ దర్శనం కోసం భక్తులు ముందుగా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దర్శనానికి ఉదయం నంచి సాయంత్రం 6గంటల వరకు అనుమతిస్తారు.