
Tirupati: లా విద్యార్థిపై అత్యాచారం.. కీచక దంపతులు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతిలో లా విద్యార్థిని అత్యాచారం చేసి, బ్లాక్ మెయిల్ చేసిన కీచక దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.
కర్నూలుకు చెందిన ఓ యువతి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో ఎల్ఎల్‌బీ మూడో సంవత్సరం చదువుతోంది.
ఆమెతో సన్నిహితంగా ఉన్న, ఓ యువతి తన భర్తను పరిచయం చేసింది. ఈ క్రమంలో మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ను యువతికి ఇచ్చి తన భర్తతో లైంగిక దాడి చేయించింది.
ఆ సమయంలో పోలీసులు, వీడియోలు తీసి 5 లక్షలు బ్లాక్ మెయిల్ చేసి, వసూలు చేసింది.
Details
పోలీసుల అదుపులో దంపతులు
తిరుపతి ఎంఆర్ పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులను ప్రణవ కృష్ణ(34), కృష్ణ కిషోర్ రెడ్డి(35)గా గుర్తించారు.
ప్రణవ కృష్ణ కూడా లా విద్యార్థినే కావడంతో తన క్లాస్‌మేట్‌ని ఇంటికి ఆహ్వానించింది. ఈ క్రమంలో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు తెలిపారు.
ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించింది.