Page Loader
మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన

మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన

వ్రాసిన వారు Stalin
Jul 22, 2023
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ పరిస్థితిపై చర్చ నేపథ్యంలో పార్లమెంట్ అట్టుడికిపోతోంది. దీంతో ఉభయ సభల్లో మణిపూర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభ, రాజ్య‌సభలో మణిపూర్‌పై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సోమవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టబోతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'ఇండియా' పేరుతో ప్రతిపక్షాలు కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తొలుత సోమవారం ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో సమావేశమై పార్లమెంటు వ్యూహంపై చర్చిస్తారని వర్గాలు తెలిపాయి. అనంతరం సభలోకి వెళ్లే ముందు గాంధీ విగ్రహం దగ్గర నేతలు నిరసన తెలుపనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'ఇండియా' ఆధ్వర్యంలో నిరసన