Page Loader
Komatireddy Rajagopal: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి.. 
బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి..

Komatireddy Rajagopal: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి.. 

వ్రాసిన వారు Stalin
Oct 25, 2023
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

అసెంబ్లీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ నెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఇక రాజగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు. 2918ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మనుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2022 ఆగస్టులో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి రావడానికి హైకమాండ్ కూడా ఆమోదించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

27వ తేదీన కాంగ్రెస్‌లో చేరిక!