NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / DSC Results 2024: నేడు తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం..
    తదుపరి వార్తా కథనం
    DSC Results 2024: నేడు తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం..
    నేడు తెలంగాణ డీఎస్సీ ఫలితాలు

    DSC Results 2024: నేడు తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 30, 2024
    08:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు మరికొద్దిసేపట్లో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రకటించనున్నారు.

    డీఎస్సీ మార్కులతో పాటు, టెట్ మార్కులు కూడా ఈ ర్యాంక్ జాబితాలో చేర్చబడ్డాయి.తరువాత, జిల్లాల వారీగా సాధారణ ర్యాంకు జాబితా విడుదల చేయనున్నారు.

    ఈ సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా,రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితా ప్రకటించే అవకాశం ఉంది.

    అనంతరం డీఈవోల ఆధ్వర్యంలో మెరిట్ సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు,సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత నియామక పత్రాలు జారీ చేస్తారు.

    గతేడాది డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.

    వివరాలు 

    ఫలితాలు విడుదలలో సరికొత్త రికార్డు 

    ఈ ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది.జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించగా,కొత్త ప్రభుత్వం 56 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసి సరికొత్త రికార్డు సాధించింది.

    ఈ సారి ప్రభుత్వం తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో డీఎస్సీ పరీక్షలను నిర్వహించింది.

    మొత్తం 2,45,263 అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.ఆగస్టు 13న ప్రిలిమినరీ కీ విడుదల అయ్యింది.

    ఆగస్టు 20 వరకు అభ్యంతరాలను స్వీకరించారు,తరువాత సెప్టెంబర్ 6న ఫైనల్ కీని విడుదల చేశారు.

    వివరాలు 

    అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా భర్తీ 

    ఈ పరీక్షల ద్వారా 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు,727 భాషా పండితులు,182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, 220 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టు అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    తెలంగాణ

    Revanth Reddy: వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోండి.. కేంద్ర బృందంతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం రేవంత్ రెడ్డి
    TPCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ రేవంత్ రెడ్డి
    Bhatti Vikramarka: మహిళా సంఘాలతో సోలార్ పవర్ ప్రాజెక్టులు : భట్టి విక్రమార్క భట్టి విక్రమార్క
    Telangana: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. ఏడు పట్టణాల్లో స్వశక్తి భవనాలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025