Manipur viral video: సుప్రీంకోర్టును ఆశ్రయించిన మణిపూర్ లైంగిక వేధింపుల బాధితులు; నేడు విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రగా ఊరేగించిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
ఈ కేసులో బాధితులు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మణిపూర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని బాధితులు ప్రతివాదులుగా చేర్చారు.
ఈ కేసుపై సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
జూలై 19న మణిపూర్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరు కుకీ మహిళలను ఒక గుంపు వీధిలో నగ్నంగా ఊరేగించింది. అంతేకాదు ఆ మహిళపై అత్యాచారం కూడా జరిగింది.
ఈ వీడియో మే 3న మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండ తర్వాత మరుసటి రోజు మే 4న జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మే 18న కాంగ్‌పోక్పీ జిల్లా సైకుల్ పోలీస్ జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రాన్ని ప్రతివాదులుగా చేర్చిన బాధితులు
BREAKING: Fresh plea before Supreme Court in relation to the May 4 viral video incident from Manipur. Two survivors approach Court with a fresh petition against Manipur Govt & the Centre. Plea to be heard today by the CJI-led bench. More details awaited. #Manipur #SupremeCourt pic.twitter.com/LGT9D8Nq1h
— Law Today (@LawTodayLive) July 31, 2023