Page Loader
City Centre Mall: రాయ్‌పూర్‌లో విషాద ఘటన..తండ్రి చేతుల్లోంచి జారిపడి పసికందు మృతి 
రాయ్‌పూర్‌లో విషాద ఘటన..తండ్రి చేతుల్లోంచి జారిపడి పసికందు మృతి

City Centre Mall: రాయ్‌పూర్‌లో విషాద ఘటన..తండ్రి చేతుల్లోంచి జారిపడి పసికందు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 21, 2024
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ఓ మాల్‌లోని మూడో అంతస్థు నుండి తండ్రి చేతుల్లోంచి జారిపడి ఏడాది వయసున్నచిన్నారి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన రాయ్‌పూర్‌లోని సిటీ సెంటర్‌ మాల్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన మాల్‌లోని సీసీటీవీలో రికార్డయింది. తండ్రి తన ఇద్దరు కుమారులతో కలిసి మూడో అంతస్తులో ఎస్కలేటర్‌ వద్ద నిలబడగా..ఐదేళ్ల కుమారుడు దాని పైకి ఎక్కడానికి ప్రయత్నించాడు. దీంతో తండ్రి బాలుడిని ఆపడానికి ప్రయత్నిస్తుండగా పట్టుతప్పి అతని చేతుల్లో ఉన్న ఏడాదిన్నర చిన్నారి దాదాపు 40 అడుగుల నేలపై పడిపోయాడు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సీసీ కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీసీ కెమెరాలో రికార్డు అయ్యిన దృశ్యం